శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (15:26 IST)

బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ బెస్ట్.. అప్పుడు ఫిక్సింగ్ భరతం పట్టాడు: సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష, కార్యదర్శలుగా ఉన్న అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను ఆ పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ పదవి రేసులో మాజీ కెప్టెన్ సౌరవ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష, కార్యదర్శలుగా ఉన్న అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను ఆ పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ పదవి రేసులో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీసీసీఐలో అత్యున్నత పదవులు చేపట్టేందుకు స్ట్రాంగ్ బెంచ్ ఉందన్నారు.
 
కానీ తన దృష్టిలో సౌరవ్ గంగూలీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తే బాగుంటుందని.. 1999-2000 టైమ్‌లో  టీమిండియాను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం పట్టి పీడిస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడని కితాబిచ్చాడు. ఆ తర్వాత జట్టు ముఖచిత్రాన్నే తను మార్చేశాడని గవాస్కర్ కితాబిచ్చారు. 
 
బీసీసీఐ వ్యవహారంలో గత కొన్ని నెలల పాటు చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా బీసీసీఐ పరువు పోయిందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు అందరికీ శిరోధార్యమని.. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందేనని తెలిపారు.