క్రికెట్ మైదానంలో దాయాదుల యుద్ధం... ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ (Video)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సాధారణ లీగ్ మ్యాచ్‌లు జరగడం ఓ యుద్ధంగా భావిస్తారు. అలాంటి
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సాధారణ లీగ్ మ్యాచ్‌లు జరగడం ఓ యుద్ధంగా భావిస్తారు. అలాంటిది ఐసీసీ నిర్వహించే ప్రధాన ఈవెంట్లలో ఒకటైన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈ జట్లు తలపడనున్నాయి. దీంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. అలాగే, క్రికెట్ బెట్టింగ్స్ కూడా రూ.కోట్లకు చేరుకుంటున్నాయి.
కాగా, గురువారం జరిగిన రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ ఓడించి అలవోకగా ఫైనల్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. అదేసమయంలో దాయాది దేశం పాకిస్థాన్‌కు ప్రమాద ఘటికలు పంపారు. పాకిస్థాన్‌తో పోరాటం ద్వారా ఐసీసీ ఛాపింయన్స్ లీగ్ ప్రారంభించిన భారతజట్టు తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో మట్టికరిచారు. భారత్‌తో ఓటమితో బుద్ధి తెచ్చుకున్న పాక్ ఊహించని రీతిలో పుంజుకుని సెమీ ఫైనల్‌లో ప్రవేశించింది.
అనంతరం పటిష్టమైన ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన టీమిండియా సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదిలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఐదు రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తూ వారిని ఆత్మరక్షణలో పడేశారు. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ మ్యాచ్ గతిని మార్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఏమాత్రం తొందరలేకుండా కళాత్మక షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అర్థ సెంచరీకి చేరువలో ధావన్ అవుటయ్యాడు. అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. వీరిద్దరి భాగస్వామ్యం అద్భుతంగా కొనసాగింది. భారీ షాట్లతో పనేంటన్నట్టుగా, కళాత్మకంగా బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టును విజయపథంలో నిలిపారు. దీంతో పాకిస్థాన్‌కు గుబులు పట్టుకుంది. బౌలింగ్ బలం కారణంగా ఫైనల్లో ప్రవేశించిన పాక్ టీమిండియాను ఎదర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరోవైపు.. 1992లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 1996లో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో ఈ రెండు జట్లూ తలపడ్డాయి. 2004, 200, 2010, 2012లలో ఇరు జట్లూ ప్రధాన ఈవెంట్లలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో ఇరు జట్ల ఆటగాళ్లూ మైదానంలో కొదమసింహాల్లా విజయం కోసం పోటీపడ్డారు. కొన్ని సందర్భాల్ ఆటగాళ్లు ఘర్షణకు కూడా దిగారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది.