హమ్మయ్య... బంగ్లాను కట్టడి చేసిన కోహ్లి సేన... భారత్ లక్ష్యం 265 పరుగులు
బర్మింగ్ హామ్ లో చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో భాగంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న పోటీలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. ఒక దశలో బంగ్లా 300 పరుగులకు పైగా చేసేట్లు కనిపించింది. ఐతే స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో బంగ్లా బ్య
బర్మింగ్ హామ్ లో చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో భాగంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న పోటీలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. ఒక దశలో బంగ్లా 300 పరుగులకు పైగా చేసేట్లు కనిపించింది. ఐతే స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో బంగ్లా బ్యాట్సమన్ వికెట్లు నేలకూలాయి.
ఇక బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు ఇక్బాల్ 70 పరుగులు, సర్కార్ 0, రహ్మాన్ 19, ముషిఫికర్ 61, హాసన్ 15, అబ్దుల్లా 21, మోసద్దీక్ 15, మోర్టాజా 30 నాటౌట్, అహ్మద్ 11 పరుగులు చేశారు. ఎక్సట్రాలు 22 పరుగులు కలుపుకుని బంగ్లాదేశ్ 264 పరుగులు చేసింది.