సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (09:25 IST)

మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం దావా

ms dhoni
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. దీనిపై గురువారం ఢిల్లీ కోర్టులో విచారణ జరుగనుంది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్‌ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ధోనీపై పరువు నష్టం దావా వేశారు. వ్యాపార ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ అసత్య ఆరోపణలు, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారనీ, నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌పారమ్‌లు, అనేక మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని వారు కోర్టును అభ్యర్థించారు. 2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ.16 కోట్ల ఎగ్గొట్టారని ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని దివాకర్, దాస్‌లో తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టిన విషయం తెల్సిందే. క్రికెట్ అకాడెమీలు ఏర్పాటు చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకుని దానిని పాటించలేదని ఆయన తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఫ్లైట్ సర్వీస్ 3 గంటలకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే.... 
 
ఇకపై విమాన సర్వీసులు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తగిన చర్యలు తీసుకోనుంది. ఇటీవలికాలంలో విమానాల ఆలస్యం, ఇష్టానుసారంగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. 
 
సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (ఎస్‌పీ) జారీ చేసింది. ఫ్లైట్ సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్ లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 
 
ఎయిర్ పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనిని రూపొందించింది. అయితే విమానం రద్దయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బోర్డింగ్‌ల తిరస్కరణ, విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
 
కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ ముద్రిస్తారు. ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీఏఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మధ్య పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
డీజీసీఏ జారీచేసిన మార్గదర్శకాల వివరాలను పరిశీలిస్తే, విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలియజేయాలి. అధికారిక వెబ్‌సైట్, బాధిత ప్రయాణీకులకు మెసేజ్ లేదా వాట్సప్, ఈ-మెయిల్, ఇతర నోటిఫికేషన్ మార్గాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలి. ఎయిర్ పోర్టులోని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికుల పట్ల ఓపికగా నడుచుకోవాలి. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించాలి. ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తుండాలి.