శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:38 IST)

విరాట్ కోహ్లీ తలకు వెల కట్టిన లష్కరే తోయిబా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తలకు ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వెల కట్టింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారమన్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రుల తలకు కూడా వెల కట్టింది. వీరందరి పేర్లను హిట్ లిస్టులో చేర్చింది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలితప్రాంతాలుగా చేసింది. దీన్ని పాకిస్థాన్‌తో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో భారత్‌లో విధ్వంసం సృష్టించాలన్న తపనతో రగిలిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఎక్కువ శాతం రాజ‌కీయ‌వేత్త‌ల‌ను టార్గెట్ చేసే హిట్‌లిస్టులో క్రికెట‌ర్ కోహ్లీ పేరు ఉండటం ఇదే మొద‌టిసారి. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)కి అందిన లేఖ‌లో ఆ పేర్లు ఉన్నాయి. 
 
కోళికోడ్‌‌ నుంచి ఆ లేఖ రిలీజైంది. ఇక బంగ్లాతో న‌వంబ‌రు 3వ తేదీన కోహ్లీసేన తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో కోహ్లీకి ఢిల్లీ పోలీసులు భద్రతను మరింతగా పెంచారు.