మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 29 జనవరి 2017 (20:24 IST)

ఇండియా-ఇంగ్లాండ్ టి-20, ఉతుకుతున్న రాహుల్, ఎవరీ రాహుల్..?

ఇండియా-ఇంగ్లాండు జట్ల మధ్య టి-20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లోకేష్ రాహుల్ మెరుపు షాట్లతో ఇంగ్లాండు బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఈ రాహుల్ ఎవరు అని చూస్తే.... వికెట్ కీపర్ గా మైదానంలో ఆడే రాహుల్ ఇప్పుడు ధోనీ లెవల్లో చెలరేగిపోతున్నాడు. అతడి ప్ర

ఇండియా-ఇంగ్లాండు జట్ల మధ్య టి-20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లోకేష్ రాహుల్ మెరుపు షాట్లతో ఇంగ్లాండు బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఈ రాహుల్ ఎవరు అని చూస్తే.... వికెట్ కీపర్ గా మైదానంలో ఆడే రాహుల్ ఇప్పుడు ధోనీ లెవల్లో చెలరేగిపోతున్నాడు. అతడి ప్రొఫైల్ చూస్తే.... పూర్తిపేరు కన్నౌర్ లోకేష్ రాహుల్. పుట్టింది కర్నాటక లోని బెంగళూరు. ఇప్పటివరకూ 12 టెస్టులు ఆడి 795 పరుగులు చేసాడు. 
 
అందులో 199 అత్యధిక పరుగుల రికార్డు వుంది. వన్డేలు ఆరు ఆడితే పరుగులు 220 సాధించాడు. అత్యధికం 100 పరుగులు. టి20లు 6 ఆడిన రాహుల్ అత్యధికంగా 110 పరుగులు చేశాడు. ట్వంటి-20 మ్యాచులు 59 ఆడగా మొత్తం 1237 పరుగులు చేసాడు. వాటిలో 110 పరుగులు అత్యధికం. ఇక ఇంగ్లాండుతో జరుగుతున్న టి20 మ్యాచులో రాహుల్ 47 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టి 71 పరుగలు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 17.2 ఓవర్లలో 125 పరుగులు.