బుధవారం, 15 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (17:17 IST)

భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ మృతి.. గదిలో విగతజీవిగా..

భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జ

భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ ముంబైలోని ఓ లాడ్జి గదిలో ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల బీసీసీఐ తరపున సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. 
 
రాజేష్ సావంత్ కనిపించకపోయేసరికి వెతకగా.. తన రూమ్‌లో నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆయన గుండెపోటుతో మరణించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసులు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
భారత్ అండర్ 19 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగాలి. చివరి మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 8న జరుగుతుంది. సావంత్ ఆఫ్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు, భారత్ ఏ జట్టు ట్రైనర్‌గా కూడా పని చేశారు.