సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (11:40 IST)

నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు.. భారత బౌలర్లు అదుర్స్ (video)

india test
ఆస్ట్రేలియా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో, చివరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నెమ్మదిగా రేసులోకి వస్తున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి భలే అనిపించారు. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల జోరుకు కళ్లెం వేస్తున్నారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32), ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభం ఇచ్చారు. 
 
ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ 16 ఓవర్‌లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి బ్రేక్ అందించారు. 
 
అనంతరం 23వ ఓవర్‌లో మమ్మద్ షమీ.. మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్‌కు చుక్కలు కనిపించాయి. ఈ మూడు వికెట్లు సాధించడంతో ఆస్ట్రేలియా 73 పరుగులు సాధించింది.