శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (17:54 IST)

ధోనీ రికార్డ్ అదుర్స్.. సచిన్, ద్రావిడ్ తర్వాత మహీ.. అజారుద్ధీన్ రికార్డ్ సమం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గ్రేట్ వాల్ ద్రవిడ్‌ల తర్వాత ధోనీ స్థానం సంపాదించుకున్నాడు. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో మొత్తం 334 మ్యాచ్‌ల‌తో మూడో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెటో పోటీలలో ధోనీ భారత్ తరపున 334 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. తద్వార సచిన్ (463), ద్రవిడ్ (340)ల తర్వాతి స్థానంలో ధోనీ నిలిచాడు. 
 
అంతేగాకుండా.. కెరీర్‌లో 334 వ‌న్డేలు ఆడిన‌ భార‌త మాజీ సార‌థి మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ రికార్డును ధోనీ స‌మం చేశాడు. ధోనీ కెరీర్‌లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇందులో మూడు మ్యాచ్‌లు ఆసియా జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. ఇంకా ధోనీ కెరీర్‌లో వ‌న్డేలు ఆడ‌నుండ‌టంతో ద్ర‌ావిడ్ రికార్డును ధోనీ అధిగమించ‌నున్నాడు.