సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (14:53 IST)

దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ వివరణ.. షూ సెలబ్రేషన్‌తో ధావన్‌ను అలా చేయలేదు..

దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసింది. దాంతో సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. అయితే చివరి టీ20లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఔటైన తర్వాత షమీ తన షూతీసి సెలబ్రేట్‌ చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షమ్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. దీనిపై షమ్సీ ట్విట్టర్  వేదికగా స్పందించాడు. తానేమీ శిఖర్ ధావన్‌ను అగౌరవపరచలేదని వివరించాడు. అది కేవలం క్రీడపై వున్న ప్రేమేనని.. ఎంజాయ్ మెంట్‌ కోసం చేశానని.. అది కేవలం వినోదం మాత్రమేనని చెప్పుకొచ్చాడు. 
 
అయితే ధావన్‌తో ఫీల్డ్‌లో జరిగిన చిట్‌చాట్‌ను కూడా షమ్సీ పేర్కొన్నాడు. 'నేను వేసిన తొలి రెండు బంతుల్ని నువ్వు ఎందుకు సిక్సర్లగా కొట్టలేదని అడిగాను. దానికి శిఖర్‌ ధావన్‌ నవ్వుతూనే సమాధానం చెప్పాడు' అని అన్నాడు.