శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (14:56 IST)

పేరు ఏదైనా కావొచ్చు... నా బిడ్డ దేశానికి పేరు తెస్తాడు.. : ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్

తన కుమారుడు కూడా నాన్న, పెదనాన్నలాగా దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని భారత్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఇలా స్పందించడానికి ఓ కారణం లేకపోలేదు.

తన కుమారుడు కూడా నాన్న, పెదనాన్నలాగా దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని భారత్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఇలా స్పందించడానికి ఓ కారణం లేకపోలేదు. 
 
ఈమధ్యనే ఇర్ఫాన్‌-సఫాబేగ్‌ దంపతులకు కుమారుడు పుట్టాడు. ఈ వార్తను ఇర్ఫాన్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో పలువురు అభిమానులు స్పందించారు. వీరిలో దివ్యాన్షురాజు అనే అభిమాని స్పందిస్తూ.. ''కుమారుడు పుట్టినందుకు శుభాకాంక్షలు. ఆ చిన్నారికి దావూద్‌, యాకూబ్‌ అనే పేర్లు పెట్టొద్దు సోదరా. హాస్యాస్పదంగా ఉంటుంది'' అంటూ వెటకారంగా ఉచిత సలహా ఇచ్చాడు. 
 
దీనికి ఇర్ఫాన్‌ కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ ఆల్‌రౌండర్‌ చాలా హుందాగా స్పందించి అభిమానుల మనసు దోచుకున్నాడు. 'దివ్యాన్షుగారు.. పేరు ఏదైనా కానీయండి, ఒక్కటి మాత్రం నిజం.. నా కుమారుడు నాన్న, పెదనాన్నలా దేశానికి మంచిపేరు తీసుకొస్తాడు' అని సమాధానమిచ్చాడు.
 
పైగా, తన కుమారుడికి 'ఇమ్రాన్‌ ఖాన్‌ పఠాన్‌'గా నామకరణం చేసినట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ పేరు తన కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుందని వివరించాడు. దీంతో పాటు తన కుమారుడి బుజ్జి చేయి ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు.