అయ్యబాబోయ్.. నేను "గే"ను కాదు : జేమ్స్ ఫాల్కనర్
ఆస్ట్రేలియా క్రికెట్ జేమ్స్ ఫాల్కనర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. తన 29వ బర్త్‌డే సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోనే ఇపుడు పెద్ద దుమారం రేపింది.
పుట్టినరోజున నాడు తన తల్లితో పాటు తన మిత్రుడితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దానికింద బాయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజు డిన్నర్ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఐదేండ్లుగా కలిసి ఉంటున్నాం అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు.
అంతే... పుంఖానుపుంఖాలుగా అతడిపై వార్తలు పుట్టుకొచ్చాయి. ఫాల్క్‌నర్ గే అని.. అందుకు అతడు సిగ్గుపడటం లేదని.. దాన్ని దాచుకోకుండా బహిరంగపర్చడం గొప్ప విషయం అంటూ ఎవరికి తోచిన విధంగా వారు రాసుకొచ్చారు.
దీంతో బెంబేలెత్తిపోయిన ఫాల్క్‌నర్ అయ్యా బాబూ మీరంత తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను గేను కాదు. అతడు నా సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి. గత ఐదేండ్లుగా మేము కలిసి ఉంటున్నాం అని వివరణ ఇచ్చుకున్నాడు.
పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పోస్ట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. 'నేను గేను కాదు. రోబ్‌జుబ్‌స్తా (ఫొటోలో ఉన్న స్నేహితుడు) నాకు మంచి మిత్రుడు. గత కొన్నేండ్లుగా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాం' అని మంగళవారం మరో పోస్ట్ పెట్టాడు.