ఔట్ కాకున్నా కోహ్లీ ఎందుకు ఔటయ్యాడు? అదే కెప్టెన్సీ అంటే..!
బంగ్లాదేశ్ జట్టుతో హైద్రాబాద్‌లో జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో ఒక అరుదైన ఘటన జరిగింది. 204 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే ఆ బంతి అవుట్ సైట్‌కు అవతల వెళ్లిందని తర్వాత రీప్లేలో తేలింది. కానీ కోహ్లీ రివ్యూ అడగలేదు. అడిగి
బంగ్లాదేశ్ జట్టుతో హైద్రాబాద్‌లో జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో ఒక అరుదైన ఘటన జరిగింది. 204 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే ఆ బంతి అవుట్ సైట్‌కు అవతల వెళ్లిందని తర్వాత రీప్లేలో తేలింది. కానీ కోహ్లీ రివ్యూ అడగలేదు. అడిగి ఉంటే మళ్లీ బ్యాంటింగ్ చేసి ఉండేవాడు. అయితే అప్పటికే ఒకసారి తాను రివ్యూ కోరి అనుకూలంగా ఫలితం తెచ్చుకున్నందున, మరొక రివ్యూను తన తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌కు వదిలిపెట్టాలని కోహ్లీ భావించాడు.
మాకు రెండు రివ్యూలు ఉన్నాయి. నేను ఔట్ అయితే ఈ మ్యాచ్‌లో ఔటయిన అయిదో బ్యాట్స్‌మన్‍ని అవుతాను. తదనంతరం వచ్చే బ్యాట్స్‌మెన్ మరొక రివ్యూను వాడుకోగలుగుతారు. అంపైర్లకు రీప్లే చేసే అవకాశం లేదు. ప్లేయర్లకు కూడా లేదు. పైగా నేను స్టంప్‌లవద్ద సరైన పొజిషన్‌లోనే ఉన్నానని నాకు తెలుసు.
వికెట్ల వద్ద నేను సరిగానే ఉన్నానని తెలుస్తున్నప్పటికీ మాకు మిగిలిన మరొక రివ్యూను నేను వాడుకోవాలనుకోలేదు. ఎందుకంటే నా తర్వాత వచ్చే సాహా, జడేజా, అశ్విన్ ఏదైనా మైలురాయి సాధిస్తున్నప్పుడు డీఆర్ఎస్ అవసరం పడినప్పుడు వారు రివ్యూను వాడుకోనడానికి ఛాన్స్ ఉంటుంది. రెండో రివ్యూ ఖచ్చితంగా వారికి అవసరం కాబట్టి నేను ఇంకేం ఆలోచించకుండా వికెట్లను వీడి పెవిలియన్ వైపుకు బయలుదేరాను. అంపైర్‌తో గొడవ పడాల్సింది కూడా లేదు. ఎందుకంటే బంతి ప్యాడ్‌మీద ఎక్కడ తాకింది అని అర్థం చేసుకోవడానికి సాధ్యం కానంత వేగంగా ఆ క్షణం జరిగిపోయిందని విరాట్ కోహ్లీ వివరించాడు.