ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (17:08 IST)

భారత స్పిన్నర్ల మాయాజాలం : భారత్ లక్ష్యం 216

భారత స్పిన్నర్ల మాయాజాలం కారణంగా పర్యాటక శ్రీలంక జట్టు 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 216 పరుగుల టార్గెట్ నిలిచింది. విశాఖపట్టణం వన్డేలో లంక తక్కువ స్కోరుకే కుప్పూలింది. టాస్ ఓడి బ్యా

భారత స్పిన్నర్ల మాయాజాలం కారణంగా పర్యాటక శ్రీలంక జట్టు 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 216 పరుగుల టార్గెట్ నిలిచింది. విశాఖపట్టణం వన్డేలో లంక తక్కువ స్కోరుకే కుప్పూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మొదట భారీ టార్గెట్ దిశగా స్కోర్ చేసింది. అయితే ఓపెనర్ తరంగ (95) ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. 
 
44.5 ఓవర్లలో శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్  అయ్యింది. మొదట లంక స్కోరు 300 దాటుతుందనుకున్న క్రమంలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌(3), యజ్వేంద్ర చాహల్‌(3), పాండ్యా(2), బుమ్రా(1), భువీ(1) వికెట్లు తీశారు.
 
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా, ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తో సిరీస్ ఏ జట్టు కైవసం చేసుకుంటుందో తేలిపోతుంది. మూడో వన్డేల సిరీస్‌లో సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు, ఈ వన్డేలో గెలుపు కోసం పోటీపడుతున్నాయి.