శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (21:59 IST)

క్రిస్ గేల్ మర్మాంగాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చాను.. కోర్టులో రసెల్

ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచ కప్ సందర్భంగా వెస్టిండీస్‌కు మసాజ్‌ థెరపిస్ట్‌‌గా లీన్‌ రసెల్‌ పనిచేసింది. ఒకసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ ఆమెకు మర్మా

ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచ కప్ సందర్భంగా వెస్టిండీస్‌కు మసాజ్‌ థెరపిస్ట్‌‌గా లీన్‌ రసెల్‌ పనిచేసింది. ఒకసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ ఆమెకు మర్మాంగాన్ని చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడని సిడ్నీ పత్రికలు ఊటంకించాయి.

అయితే మీడియా సంస్థలు ఇలా వరుస పెట్టి తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడంపై క్రిస్ గేల్ పరువునష్టం దావా వేశాడు. ఆ సమయంలో తన సహచరుడు డ్వేన్‌స్మిత్‌ సైతం తనవెంటే ఉన్నాడు. ఆయన కూడా వీటిని ఖండించాడు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. 
 
అయితే సిడ్నీ కోర్టులో మసాజ్ థెరపిస్టు రసెల్ తన పట్ల క్రిస్ గేల్ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. తనకు మర్మాంగాన్ని చూపడంతో వెక్కివెక్కి ఏడ్చినట్టు రసెల్‌ కోర్టుకు తెలిపింది. ఆ రోజు టవల్ కోసం తాను ఛేంజింగ్ రూమ్‌కు వెళ్తే.. గేల్ తన వద్దకు వచ్చి ఏం వెతుకుతున్నావని అడిగాడని.. టవల్ కోసమని చెప్పడంతో.. అతని నడుముకు చుట్టుకున్న టవల్‌ను విప్పేసి కిందపడేశాడని తెలిపింది.

అప్పుడు ఆతడి మర్మాంగాన్ని చూసిన తాను దృష్టి మరల్చుకొని క్షమాపణలు చెప్పి బయటకు వచ్చేశానని.. చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేశానని రసెల్ తెలిపింది.
 
క్రిస్ గేల్‌ ఉదంతం కన్నా ముందు మసాజ్‌ చేయించుకున్న స్మిత్‌ ''సెక్సీ'' అని రసెల్‌కు సందేశం పంపానని మంగళవారం ఒప్పుకొన్నాడు. ఇదంతా జరిగినప్పుడు ఎవ్వరూ ఒక్కమాట కూడా బయటకి చెప్పే సాహసం చేయలేదని రసెల్‌ తెలిపింది. ఈ ఘటనపై పై అధికారులకు తెలిపినా ఎవ్వరూ తనకు మద్దతుగా నిలవలేదని చెప్పుకొచ్చింది.