ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:27 IST)

క్రికెట్ జట్లన్నీ బిజీబిజీ.. ఆస్ట్రేలియా జట్టులో పంజాబ్ కుర్రోడు (video)

Tanveer sangha
క్రికెట్ జట్లన్నీ బిజీబిజీగా వున్నాయి. సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021 ఫేస్ 2, అది ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో- టైట్ షెడ్యూల్‌తో ఊపిరడానంతగా మ్యాచ్‌లను ఆడుతోన్నాయి. 
 
భారత జట్టు ఏకంగా రెండుగా విడిపోయింది. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20ల కోసం యువరక్తంతో నిండిన టీమిండియా శిఖర ధావన్ సారథ్యంలో శ్రీలంకలో సిరీస్ ముగించుకుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.
 
ఇటీవలే- తన వెస్టిండీస్ పర్యటనను ముగించుకున్న ఆస్ట్రేలియా.. కొత్త దేశంలో అడుగు పెట్టింది. ఆ దేశ జాతీయ జట్టుతో అయిదు టీ20ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. 
 
రాజధాని ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడబోతోన్నాయి ఈ రెండు జట్లు. తొలి టీ20 బుధవారం ఆరంభం కాగా.. 4, 6, 7, 9, తేదీల్లో మిగిలిన నాలుగు మ్యాచులూ ముగుస్తాయి. మ్యాచ్‌లన్నీ సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతాయి. 
 
గాయం కారణంగా ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్ వైదొలగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో మాథ్యూ వేడ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. ఈ జట్టులో పంజాబీ కుర్రాడు తన్వీర్ సంఘాకు చోటు దక్కింది. అతను రిజర్వ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.