శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (14:27 IST)

మగాళ్లు ఆడుతుంటే ఎగబడి చూస్తారు... మాకేం తక్కువ : మిథాలీ ఆగ్రహం

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్ర‌శ్న మీరు ఓ మేల్ క్రికెట‌ర్‌

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్ర‌శ్న మీరు ఓ మేల్ క్రికెట‌ర్‌ని అడుగుతారా? మీ ఫేవ‌రెట్ ఫిమేల్ క్రికెట‌ర్ ఎవ‌రు అని ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ ప్ర‌శ్న చాలాసార్లు ఎదురైంది. కానీ మీరు వాళ్ల‌ను అడగండి అని మిథాలీ ఆ రిపోర్ట‌ర్‌కు క్లాస్ తీసుకుంది.
 
అంతేకాదండోయ్... మెన్ క్రికెట్‌కే ప్ర‌తి ఒక్క‌రూ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు క్రికెట్ ఆడుతుంటూ అంద‌రూ ఎగ‌బ‌డి చూస్తార‌ని, అదే మ‌హిళా క్రికెట్‌ను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేం క్రికెట్ ఆడేట‌ప్పుడు టీవీలు ఆఫ్ చేస్తారెందుక‌ని ప్ర‌శ్నించింది. కాగా, వ‌ర‌ల్డ్‌కప్‌కు ముందు జ‌రిగిన వామ‌ప్ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 85 ర‌న్స్ చేసింది మిథాలీ. ఈ మ్యాచ్‌లో ఇండియా 109 ర‌న్స్‌తో విజ‌యం సాధించింది.