ధోనీ సిక్సర్ల మోత.. కసితో వున్నాడుగా..

శుక్రవారం, 12 మార్చి 2021 (17:10 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ ధోనీ సిక్సర్ల మోత మోగించాడు. అదేంటి ధోని ఎక్కడ మ్యాచ్‌లు ఆడడం లేదు కదా.. మరి ఈ సిక్సర్లేంటి అనుకుంటున్నారా.  అవును. ఎలాగంటే.. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్‌ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.
 
దాదాపు గంట సేపు ప్రాక్టీస్‌ కొనసాగించిన ధోని ప్రాక్టీస్‌ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది.
 
ధోని ఒక్కో షాట్‌ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
కాగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. 
 
అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ భారత్‌లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

అన్నీ చూడండి

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments