సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (12:26 IST)

రిటైర్మెంట్ ప్రకటించానా? ఎప్పుడు? దేశం కోసం ఆడుతున్నా.. పీసీబీ కోసం కాదు

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వార్తలను పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఖండించాడు. తన రిటైర్మెంట్‌లో భాగంగా ఒక ఫేర్ వెల్ మ్యాచ్‌ను నిర్వహించమని పాక్ క్రికెట్ బోర్డు(పీ

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వార్తలను పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఖండించాడు. తన రిటైర్మెంట్‌లో భాగంగా ఒక ఫేర్ వెల్ మ్యాచ్‌ను నిర్వహించమని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని కూడా కోరలేదన్నాడు. తనకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పుడు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాను క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడం లేదని, అంతర్జాతీయ క్రికెట్‌ను కొనసాగిస్తానని తెలిపాడు. 
 
20 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌కు ఆడుతున్నా.. పీసీబీ కోసం కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఒక మ్యాచ్ కోసం పీసీబీ అభ్యర్థించడం ఎప్పటికీ జరగదని అఫ్రిది తెలిపాడు. తనను తాను నమ్ముకున్నా.. అంతేకానీ ఎవరిపైనా ఆధారపడలేదని చెప్పాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌ను పాకిస్తాన్ కోసం మాత్రమే ఆడుతున్నానని, పీసీబీ కోసం కాదని మండిపడ్డాడు. తన కెరీర్ ముగిసిపోయిందని అనుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.