గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (16:11 IST)

టెస్టు క్రికెట్‌లో సరికొత్త స్పిన్ సంచలనం : 3 టెస్టుల్లో 29 వికెట్లు

prabhat jayasurya
టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే 12 వికెట్లు నేలకూల్చాడు. ఈ వికెట్ కీపర్ పేరు ప్రభాత్ జయసూర్య. శ్రీలంక స్పిన్నర్. తన సంచలన స్పిన్ బౌలింగ్‌తో శ్రీలంక జట్టుకు రెండు పర్యాయాలు అందించాడు. అతని కెరీర్‌లో కేవలం మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఏకంగా 29 వికెట్లు నేలకూల్చాడు.
 
తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 246 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో ప్రభాత్ జయసూర్య కీలక పాత్ర పోషించారు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నరే. గాలేలో జరిగిన ఈ టెస్టులో ప్రభాత్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి ఐదు వికెట్లు తీశాడు. అలా పాకిస్థాన్ వికెట్ల పతనంలో కీలక భూమిక పోషించాడు. 
 
ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 118 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఇదే జట్టుపై మరోమారు 59 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇపుడు పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టులో 82 పరుగులకు ఐదు వికెట్లు, రెండో టెస్టులో 135 పరుగులకు 4 వికెట్లు, మూడో టెస్టులో 80 పరుగులిచ్చి 3 వికెట్లు, చివరి టెస్టులో 117 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. 
 
30 యేళ్ల వయసులో అరంగేట్రం చేసిన ప్రభాత్ జయసూర్య... మూడు టెస్టుల్లో మొత్తం 29 వికెట్లు తీయగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 12 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.