న్యూలుక్‌లో అదిరిపోతున్న విరాట్ కోహ్లీ!!
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ న్యూ లుక్‌లో అదిరిపోతున్నాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024లో ఆయన కొత్త లుక్‌లో మైదానంలో కనిపిస్తారు. ఈ టోర్నీ కోసం విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. తనకు కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లీ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. ఈ విమానాశ్రయంలోనే ఆయన కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ కొత్త లుక్‌లో విరాట్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఫీలవుతున్నారు.
కాగా, ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే. ఇక మార్చి 22వ తేదీ జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో 2024 ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఇరు జట్లు కూడా గెలుపుతోనే సీజన్‌ను ఆరంభించాలని భావిస్తున్నాయి.
కాగా, అనుష్క శర్మ- విరాట్ దంపతులకు ఫిబ్రవరి 15న కొడుకు పుట్టిన విషయం విదితమే. ఈ దంపతులకు ఇదివరకే కూతురు (వామిక) జన్మించింది. ఇక రెండోసారి తండ్రి అయిన కారణంగా విరాట్ గత రెండు నెలలుగా లండన్‌లోనే ఉన్నాడు. ఈ కారణంగానే రీసెంట్గా ముగిసిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించాడు. ఇక కోహ్లీ చివరిగా 2024 జనవరిలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇక మార్చి 19న బెంగుళూరులో జరగనున్న ఆర్సీబీ ఆన్వెల్ ఇన్ బాక్స్ ప్రమోషన్ ఈవెంట్లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.