ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (12:04 IST)

దిగ్గజ బౌలర్‌కు ముచ్చెటలు పట్టించిన దిండిగల్ డ్రాగన్స్ జట్టు బౌలర్లు!!

aswin
ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంతర్జాతీకయ క్రికెటర్లకు ముచ్చెమటలు పట్టించిన భారత స్పిన్నర్ ఆర్.అశ్విన్‌కు ఇపుడు ఓ బచ్చా క్రికెటర్ ముచ్చెమటలు పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ క్రికెటర్ పేరు ఎస్.మోహన్. దిండిగల్ డ్రాగన్ జట్టు బౌలర్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నీలోభాగంగా, ఆదివారం దిండిగల్ డ్రాగన్ వర్సెస్ నెల్లయ్ రాయల్ కింగ్స్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఇందులో డ్రాగన్స్ జట్టు తొలి ఓవర్‌లో ఎస్.మోహన్ ప్రశాంత్ బౌలింగ్‌కు దిగాడు. అతడు బౌలింగ్ చేసే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆర్.అశ్విన్... బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ప్రశాంత్ బంతి వేయడం ఆపి అశ్విన్‌ను హెచ్చరించడమే కాకుండా, ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇలా ఒక దిగ్గజ క్రీడాకారుడికి ప్రశాంత్ ముచ్చెమటలు పట్టించిన వైనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
 
నిజానికి భారత్‌ క్రికెట్ జట్టుకు ఒంటిచేత్తో అనేక విజయాలు అందించిన ఆటగాడిగా అశ్విన్‌కు పేరుంది. క్రికెట్ మైదానంలో నిబంధనలు పాటించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. గతంలో నిబనంధనలు పాటించని ప్రత్యర్థి క్రీడాకారులను పట్టుబట్టి మరీ ఔట్‌గా ప్రకటించేలా నడుచుకునేవాడు. తన బౌలింగ్ నాన్‌స్టైరకర్ వైపున ఉన్న ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బంతివేయక ముందే క్రీజ్ దాటినందుకు ఔట్ చేయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక తాజా తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆర్.అశ్విన్ ఇదే తప్పు చేయబోయి ఇరుక్కుపోయాడు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.