పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి తాజాగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పోలీసు ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతుండటమే కాకుండా నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
దీనితో చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలనీ, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో మంత్రి రాంప్రసాద్ ఇలాంటివి పునరావృతం కావని సంజాయిషీ ఇచ్చుకున్నారు.