బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (09:24 IST)

విరాట్ కోహ్లీ సహచరుడు సచిన్ బేబికి అన్నా చాందీనితో వివాహం.. ఎప్పుడంటే? (Video)

టీమిండియా క్రికెటర్లు వరుసగా ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో విరాట్ కోహ్లీ సహచరుడైన మరో క్రికెటర్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. నూతన సంవత్సరం సందర్భంగా విరాట్ కోహ్

టీమిండియా క్రికెటర్లు వరుసగా ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో విరాట్ కోహ్లీ సహచరుడైన మరో క్రికెటర్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. నూతన సంవత్సరం సందర్భంగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట నిశ్చితార్థం చేసుకోబోతున్నారన్న వార్తలొచ్చినా.. అవన్నీ ఉత్తుత్తివేనని కొట్టిపారేశాడు కోహ్లీ. తాజాగా కేరళ క్రికెటర్ సచిన్ బేబీ తన ప్రియురాలు అన్నాచాందీని వివాహమాడబోతున్నాడు. వీరిద్దరు సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో అన్నాచాందిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సచిన్ బేబీ ప్రకటించాడు. ఈ నెల 5న తోడుపుఝాలోని చర్చిలో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగు పెట్టనుంది. అదేవిధంగా ఈ జంట వివాహ ఆహ్వాన వీడియోను కోకోనట్స్ వెడ్డింగ్స్ ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు మొదట కృతజ్ఞతలు చెప్పాడు సచిన్‌ బేబి.