సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (22:16 IST)

సరికొత్త వేషధారణలో సచిన్.. వెడ్డింగ్‌ షాదీ సెలబ్రేషన్స్‌ అంటూ...

sachin
sachin
మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరికొత్త వేషధారణలో కనిపించాడు. తన సోదరుడు నితిన్ టెండూల్కర్ కుమార్తె కరిష్మా వివాహం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిశాడు. 
 
వేడుకల్లో భాగంగా గోధుమ కలర్‌ షేర్వాణీ ధరించిన సచిన్‌.. తలపై ఎర్రటి తలపాగా (ఫేటా)తో ఓ రాజవంశీయుడిలా దర్శనమిచ్చాడు. 
 
తన వేషధారణకు సంబంధించిన వీడియోను సచిన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనికి వెడ్డింగ్‌ షాదీ సెలబ్రేషన్స్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశాడు.
 
తన అన్న కూతురు పెళ్లి వేడుకలో భాగంగానే ఈ ట్రెడిషినల్‌ వేర్‌తో పాటు ఫెటాను ధరించాను' అని చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.