శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:04 IST)

నాకు బరోడాతో ఎంతో అనుభవం ఉంది : సచిన్ టెండూల్కర్

sachin tendulkar
దేశంలోని ఉన్న జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన బరోడాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అండర్-15 టోర్నమెంట్ లో మహారాష్ట్ర తరపున ఆడి, 123 పరుగులు చేశానని చెప్పిన సచిన్ బరోడాతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. 
 
తాను ముంబై తరపున ఆడి మొదటి సెంచరీ బరోడాలో చేశానని, ఈ విషయం చాలా మందికి తెలియదని, 1986లో అండర్-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరపున పాల్గొని 123 పరుగులు చేశానని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్ తన తొలి ఇన్నింగ్స్, బరోడాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
అండర్-15 టోర్నమెంట్లో మహారాష్ట్ర తరపున ఆడిన తర్వాత ముంబై రంజీ జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. అప్పుడు ప్రాబబుల్స్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదన్నారు. కానీ యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా బరోడాలోనే జరిగిందని గుర్తుచేశారు. ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫౌండర్ సయాజీ రావు గైక్వాడ్ 3 ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం తనకు లభించిందన్నారు.