శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (15:50 IST)

ప్రపంచకప్‌లో ఆడమంటే.. ఉద్యోగం ఊడుతుంది పోవయ్యా అన్నాడు..?

టీమిండియా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం యువకులు వేయి కనులతో ఎదురుచూస్తుంటారు. భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కడమంటే నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా కావాలి. అలాంటిది ఏకంగా ప్రపంచ కప్‌ ఆడే జ

టీమిండియా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం యువకులు వేయి కనులతో ఎదురుచూస్తుంటారు. భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కడమంటే నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా కావాలి. అలాంటిది ఏకంగా ప్రపంచ కప్‌ ఆడే జట్టులోనే స్థానం కల్పిస్తామంటే ఎగిరి గంతేయాల్సిందిపోయి.. వన్డే ఆడనని చెప్పాడు.. ఓ వ్యక్తి.
 
ప్రపంచ కప్‌లో ఆడితే చేస్తున్న ఉద్యోగం పోతుందని వివరణ వేరే ఇచ్చాడు. ఇంతకీ అతనెవరో తెలుసా? భారత దేశానికి రెండో ప్రపంచ కప్ అందించిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ. ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని ఉద్యోగం కోసం ధోనీ వదులుకున్నాడని సౌరవ్ గంగూలీ తన ఆత్మకథ ''ఏ సెంచనీ ఈజ్ నాట్ ఇనఫ్'' అనే పుస్తకంలో చెప్పుకొచ్చాడు.
 
అసలేం జరిగిందంటే..? 2003 ప్రపంచకప్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు కెప్టెన్‌గా గంగూలీ ఉండేవాడు. అయితే ప్రపంచకప్ కంటే ముందే భారత జట్టులోకి యువకులను తీసుకోవాలని అన్వేషిస్తుండగా గంగూలీ కంట ధోని పడ్డాడు. దీంతో ప్రపంచ కప్‌లో ఆడాల్సిందిగా ధోనీ గంగూలీ ఆహ్వానించాడు. 
 
కానీ తాను ప్రస్తుతం రైల్వేలో టికెట్ కలెక్టర్ జాబ్ చేస్తున్నానని.. రాలేనని చెప్పడంతో గంగూలీ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గంగూలీ రాసుకున్నాడు. అయితే గంగూలీ సలహా మేరకే 2004లో ధోని జట్టులోకి వచ్చాడు. ఏదో ఒక రోజు ధోనీ గుర్తింపు తెచ్చుకుంటాడని తనకు తెలుసని.. తన నమ్మకాని అతడు వమ్ము చేయలేదని గంగూలీ ఆత్మకథలో చెప్పుకొచ్చాడు.