మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (08:49 IST)

వన్డేల్లో జార్ఖండ్ డైనమెట్ వరల్డ్ రికార్డు.. ఏంటది?

జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్ జరుగనుంది.

జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా, ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో కీపర్‌గా రికార్డులకెక్కాడు. 
 
శ్రీలంక మాజీ కెప్టెన్, కీపర్ కుమార సంగక్కర తొలుత ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ధోనీ 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఆరో ఆటగాడు. సచిన్, రాహుల్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు.