బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2017 (07:36 IST)

నేటి దినఫలాలు : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి

మేషం : విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి అవలంభించుటవల్ల మాటపడక త

మేషం : విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి అవలంభించుటవల్ల మాటపడక తప్పదు. వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
వృషభం : స్త్రీలు, టీవీ, చానెల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. సిమెంట్, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకులు కలిగిస్తుంది. ఏదన్నా అమ్మకానికి లేదా కొనడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మిథునం : విద్యార్థులు బంజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. కటుంబీకులతో ముభావంగా ఉంటారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతిని చెందుతారు.
 
కర్కాటకం : హోటల్ తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు.
 
సింహం : మత్స్యు కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. ప్రయత్నపూర్వకంగా మొండిబాకీలు వసూలు కాలగవు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.
 
కన్య : రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాల్లోనూ ప్రయాణాల్లోనూ మెళకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.
 
తుల : స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధికి, గౌరవం పొందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బంధువులతో తెగిపోయిన సత్సంబంధాలు తిరిగి బలపడతాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది.
 
వృశ్చికం : కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు : మత్య్సు, కోళ్లు, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. సంఘంలో మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచన ఉంటుంది.
 
మకరం : విద్యార్థులు ఉల్లాంసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు.
 
కుంభం : ముఖ్యుల నుండి అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. మీ సంతానం వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగిబలపడతాయి.
 
మీనం : పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభంకాగలవు. ముఖ్య వ్యవహారాలు మరింతగ వేగవంతం చేస్తారు. కుటుంబ సౌఖ్య, వాహన యోగం పొందుతారు.