ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (08:40 IST)

గురువారం దినఫలాలు : సర్వదోషాలు తొలగిపోతాయి

మేషం : ఉన్నత విద్యకై, విదేశాలకు వెళ్లడానికైచేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహంలో మార్పులు వాయిదా పడతాయి.

మేషం : ఉన్నత విద్యకై, విదేశాలకు వెళ్లడానికైచేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. ప్రయాణాలు ఆలస్యం వల్ల పనులు వాయిదా పడతాయి. 
 
వృషభం : ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా వేయడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు పనివారితో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మిథునం : ముఖ్యమైన వ్యవహారాలు ధనంతో ముడిపడివుంటాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. మిత్రుల ద్వారా ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం : వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆర్థికంగా ఆశించినంత సంతృప్తి ఉండదు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకోగలుగుతారు. 
 
కన్య : అదనపు ఆదాయం కోసం నూతన మార్గాలు అన్వేషిస్తారు. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఒకస్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. మీ ఉన్నతిని చూసి అసూయేపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
తుల : ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌కు ఆటంకాలెదురవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. ప్రేమికుల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వృత్తుల వారికి పరిచయాలు, గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. 
 
వృశ్చికం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. విద్యార్థినుల ఒత్తిడి, చికాకులకు గురవుతారు. శ్రమాధిక్యత వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టిపెడతారు. 
 
ధనస్సు : మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్తలు అవసరం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారులకు అనుకూలం. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. 
 
మకరం : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంధువులతో తెగిపోయిన సత్సంబంధాలు తిరిగి బలపడతాయి. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు పురోభివృద్ధి. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మీ శ్రీమతి సలహాను తేలికగా తీసుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం : ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. రవాణా రంగంలోని వారికి సంతృప్తి కానరాగలదు. అనుభవపూర్వకంగా మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. శారీరకశ్రమ, నిద్రలేమితో ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. 
 
మీనం : కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. విదేశాలు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులతో తోటివారితో సాన్నిత్యం, ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.