శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (08:23 IST)

ఆదివారం దినఫలాలు... నేర్పులకిది పరీక్షా సమయం..

మేషం : వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ది సాధిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షాసమయం. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస

మేషం : వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ది సాధిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షాసమయం. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. నమ్మినవారే దగాచేయుదురు.
 
వృషభం : విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
మిథునం : ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభ పరిణామాలున్నాయి. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
కర్కాటకం : స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరించటం వల్ల క్షణం తీరిక ఉండదు. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యంగా లోనవుతారు.
 
సింహం : కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత వహించండి. కీలక భాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచనఅవసరం. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
కన్య : మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారవుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు నిశ్చంత కలిగిస్తాయి. కుటుంబీకులతో ముభావంగాఉంటారు. రాజకీయనాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. ఉపాధాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం : కీలకమైన వ్యవహరాల్లో జయం, మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ద పెరుగును. మత్స్య వ్యాపారస్తులకు పురోభివృద్ది. స్త్రీలకు షాపింగ్‌‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు : 
బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. విద్యార్ధులకు చదువుల పట్ల ఏకాగ్రత అవసరం. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాలవారికి పని భారం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం : విదేశీ వ్యవహారాలు, విద్యా, రవాణా, ప్రణాళకలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. బదిలీల మార్పుల చేర్పుల అసౌక్యరం కలిగిస్తాయి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలనుదర్శిస్తారు.
 
కుంభం : వెండి, బంగారు, లోహ, రత్న వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులకు సరిపడ ధనం సమకూరుట వలన ఆర్ధిక ఇబ్బంది అంటూ వుండదు. ఏజెంట్లు, బ్రోకర్లకు అనుకూలం. మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు  ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి.
 
మీనం : బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఎ.సి, కూలర్ మోకానిక్ రంగాలలో వారికి ఆశాజనకం. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. అధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మిత్రుల నుంచి సహయ సహకారాలను పొందుతారు.