గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (08:47 IST)

బుధవారం రాశిఫలితాలు : నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం

మేషం: కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. ప్రముఖుల కలయిక ప్రయోజ నకరంగా ఉంటుంది. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఒకే కాలంలో అనేక పనులు

మేషం: కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. ప్రముఖుల కలయిక ప్రయోజ నకరంగా ఉంటుంది. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. 
 
వృషభం: రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది.
 
మిథునం: కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సామాన్యం. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. 
 
సింహం: మీ జీవితభాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కన్య: ఉద్యోగస్తులు తోటివారి ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై యత్నాలు మొదలెడతారు. మీరెదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. నిరుత్సాహపరులైన స్నేహితులను దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
 
తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. మీరు చేసే యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు, పనిభారం, చికాకులు తప్పవు. స్త్రీలకు వైద్య సలహా, ఔషధ సేవనం తప్పదు.
 
వృశ్చికం: కుటుంబ సమస్యలు, ఏ యత్నం కలిసిరాక మనస్సు ఆందోళనకు గురవుతుంది. బంధువులతో స్పర్థలు, పట్టింపులు ఎదుర్కొంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది.
 
ధనస్సు: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనుకూలం. ఉద్యోగస్తులు తరుచూ సమావేశాలు, వేడుకలలో పాల్గొంటారు. పత్రిక రంగాల్లోని వారికి చికాకులు అధికమవుతాయి. ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.
 
మకరం: విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు.
 
కుంభం: వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
మీనం: బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగువారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పీచు, నార, ఫోము, లెదర్, లాటరీ వ్యాపరస్తులకు సంతృప్తి కానవస్తుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచండి క్షేమదాయకం.