శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (08:29 IST)

మంగళవారం దినఫలాలు .. దంపతుల మధ్య కలహాలు

మేషం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో వాయిదా వేసిన పన

మేషం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. తరుచు సభలు,  సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం : పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్నది సాధ్యం కాదు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి.
 
మిథునం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు వాయిదా పడతాయి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. అపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
కర్కాటకం : నిత్యవసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరచరాస్తుల వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తరుచు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
సింహం : కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్ధం చేసుకుంటారు. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులు పూర్తి కావు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
కన్య : రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు.
 
తుల : స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.
 
వృశ్చికం : మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ ఏమురుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
ధనస్సు : షాపులలో పనిచేసే వారిలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్వయం కృషితోనే మీ పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
మకరం : చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్ధినులకు ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. మత్య్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కుంభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ధనం చేతిలో నిలబడటం కష్టమే. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. విదేశీప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం : సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. విందుల్లో పరిమితి పాటించండి.