శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (08:27 IST)

30-11-2017 గురువారం దినఫలాలు.. ఇంటర్వ్యూల సమాచారం...

మేషం : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. పండ్లు, పూలు, కొబ్బరి, వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థు

మేషం : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. పండ్లు, పూలు, కొబ్బరి, వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం : వ్యాపారాల్లో మొహమ్మాటాలు తావివ్వటం మంచిది కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతి, సంతానం కోరికలు తీర్చేందుకు యత్నించండి. ప్రముఖులను కలుసుకున్నా ఫలితం ఉండదు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
మిథునం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర, పరిశోధనా రంగాల వారికి ఆశాజనకం. క్రీడ, కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం: భాగస్వామిక ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కచ్చితంగా మెలగాలి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. 
 
సింహం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా  పూర్తి చేస్తారు. సన్నిహితుల సలహాలు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
కన్య: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు వంటి చికాకులు తప్పవు. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు పనిభారం అధికం. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.
 
తుల : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ప్రియతముల రాక మీకు సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాసాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. 
 
వృశ్చికం: దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ఊహించని సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు.
 
ధనస్సు: ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు.
 
మకరం: రావలసిన ధనం కొంత అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్యత వలన అస్వస్థతకు గురవుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. 
 
కుంభం: వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
మీనం: మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సినీ రంగాలవారికి కొంత అసౌకర్యం కలుగుతుంది. క్రయ విక్రయాల్లో నాణ్యత గమనించడం చాలా అవసరం. స్త్రీలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయాల్లో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి.