శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (08:34 IST)

నేటి దినఫలాలు.. ఇష్టకామేశ్వరిని పూజించినా...

మేషం : పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. బంధువులరాకతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా సాగవు. మీ ఉన్నతిని చూస

మేషం : పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. బంధువులరాకతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా సాగవు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
వృషభం : హామీలు, మధ్యవర్తిత్వాలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. రాబోయే ఖర్చులకు తగినట్టుగా ఆదాయం సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టం, ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. 
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చికాకులను ఎదుర్కొంటారు. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.
 
కర్కాటకం : స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తితోపాటు అవకాశాలు కలిసిరాగలవు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగానహా లోపం. విద్యార్థులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధనం ఏమాత్రం ఆదా చేయలేక పోవడం వల్ల ఆందోళన చెందుతారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనకతప్పదు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
కన్య : ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
తుల : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. 
 
వృశ్చికం : వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. 
 
ధనస్సు : భాగస్వామిక చర్చలు, ఆస్తి వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెలకువ అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైనది అని గమనించండి. 
 
మకరం : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలు. గత తప్పిదాలు పునరావృత్తమయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవవహారాల్లో మెళకువ అవసరం. ఎటువంటి సమస్య ఎదురైనా మీ ధైర్యం చెక్కు చెదరదు. అసందర్భ సంభాషణ, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కుంభం విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో ఏజెంట్లు, బ్రోకర్లతో జాగ్రత్త అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మీ యత్నాలు గోప్యంగా సాగించాలి. 
 
మీనం : వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీస్తాయి.