మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (16:24 IST)

స్పాట్ ఫిక్సింగ్.. జీవిత కాల నిషేధం.. శ్రీశాంత్‌కు సుప్రీం ఊరట

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా క్రికెటర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. బీసీసీఐ తనపై విధించిన నిషేధంపై శ్రీశాంత్‌ సుప్రీంను ఆశ్రయించాడు. శ్రీశాంత్‌ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. 
 
శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం చాలా కఠినమైనదిగా అభివర్ణించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ నిషేధంపై మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. సుప్రీం తీర్పుపై శ్రీశాంత్ స్పందిస్తూ.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన తనకు త్వరలో టీమిండియా జట్టులో స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 
తొంభై రోజులు పూర్తయ్యేవరకూ ఆగకుండా ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకోసం తాను ఆరేళ్లు ఆగాననీ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్‌తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు శ్రీశాంత్ వెల్లడించాడు. 
 
ఇకపోతే.. టీమిండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఇటీవల హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న శ్రీశాంత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.