Daily Horoscope
✕

విరాట్ కోహ్లీ ఖాతాలో డీమెరిట్ పాయింట్.. ఇది మూడోసారి..

Written By సెల్వి
Updated: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (14:18 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో డీమెరిట్ పాయింట్ చేరింది. ఇందుకు కారణం సఫారీ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను కోహ్లీ కావాలనే తన భుజంతో ఢీకొట్టడమే కారణం. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో సఫారీ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌ను కోహ్లీ భుజంతో ఢీకొట్టాడు. 
 
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని లెవల్ 1 ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీని ఐసీసీ దోషిగా తేల్చింది. కోహ్లీ సైతం తన నేరాన్ని అంగీకరించడంతో అతడి ఖాతాలో ఐసీసీ డీమెరిట్ పాయింట్ జత చేర్చింది. 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కోహ్లీకి డీమెరిట్ పాయింట్ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
జనవరి 15, 2018లో దక్షిణాఫ్రికాతో ప్రిటోరియా వేదికగా జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో తొలిసారి డీ మెరిట్ పాయింట్ చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్‌ని ఐసీసీ జత చేర్చింది.

అన్నీ చూడండి

లంచ తీసుకున్నారో కఠిన చర్యలు : హైదరాబాద్ సీపీ హెచ్చరికలు

కన్నతల్లిని దూషించాడని వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు...

తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 17, 2026 నాటి వాతావరణం ఎలా వుంది?

రామోజీరావు గారితో నా మొదటి పరిచయం అలా జరిగింది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీడియో

సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సభలో రాహుల్ స్పీచ్

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments