సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (14:10 IST)

అన్నీ ఫార్మాట్లకు ధోనీ బై బై.. విరాట్ కోహ్లీ ఎంపికపై సెలక్టర్ల నిర్ణయం భేష్: గంగూలీ

అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా ధోనీపై తీవ్ర ఒత్తిడి ఉంది. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ రాణిస్తున్న తరుణంలో విరాట్‌నే అన్ని ఫార్మెట్‌

అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా ధోనీపై తీవ్ర ఒత్తిడి ఉంది. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ రాణిస్తున్న తరుణంలో విరాట్‌నే అన్ని ఫార్మెట్‌లకు కెప్టెన్‌గా చేయాలని సెలక్టర్లపై కూడా ఒత్తిడి ఉంది. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో మొదలు కానున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు కోహ్లీని సారధిగా చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో బీసీసీఐలో ఏర్పడిన మార్పులు, జట్టు సభ్యులను ఎంపిక చేయడంలో సెలక్టర్లు, కెప్టెన్‌కు మధ్య వచ్చే అభిప్రాయభేదాల కంటే కెప్టెన్‌గా తప్పుకోవడం మంచిదని ధోనీ భావించి వుంటాడని వాదన వినిపిస్తోంది. ఇంకా టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ వెలిగిపోతుండటంతో ఆ పరిమిత, ట్వంటీ-20ల కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. దీంతో టీమిండియా అన్ని ఫార్మాట్లకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌‌గా నియమించడంపై దిగ్గజ మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.
 
కోల్ కతాలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, సెలెక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విజయపథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ స్థానంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైన వ్యక్తిగా గంగూలీ వ్యాఖ్యానించాడు. ధోనీ తరహాలోనే కోహ్లీ కూడా సమాన స్థాయిలో జట్టుకు విజయాలు సాధించి పెడతాడని గంగూలీ భరోసా ఇచ్చాడు.