ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (16:19 IST)

సఫారీలతో టైగర్స్ వార్.. బంగ్లాదేశ్‌తో జాగ్రత్త.. ఆమ్లా స్థానంలో మిల్లర్

ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. భార‌త్‌తో వార్మ‌ప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండ‌గా గాయ‌ప‌డిన బంగ్లా కెప్టెన్ మ‌ష్ర‌ఫే మొర్త‌జా మ్యాచ్ ఆడుతున్నాడు.
 
ప్రపంత కప్‌లో ఇది ఐదో లీగ్ మ్యాచ్. ఇకపోతే.. దక్షిణాఫ్రికా తన తొలి లీగ్ మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతింది. ఇక బంగ్లాదేశ్ తన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయడం తగదని క్రీడా పండితులు అంటున్నారు. ఎందుకంటే... 2007 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా సూపర్ 8 రౌండ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 67 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించడం గమనార్హం. 
 
ఇకపోతే.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూర‌మైన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ బంగ్లాతో మ్యాచ్‌లోనూ బెంచ్‌కే ప‌రిమితం అయ్యాడు. గాయపడిన ఆమ్లా స్థానంలో మిల్లర్ జట్టులోకి వచ్చాడు. ఇక క్రిస్ మోరిస్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. 
 
అయితే ప్రమాదకర జ‌ట్టుగా ముద్ర‌ప‌డిన బంగ్లాదేశ్‌తో సఫారీ జట్టు ఎలా ఆడుతుందోన‌ని ఆస‌క్తిక‌రంగా మారింది. మరోవైపు మెగాటోర్నీలో తొలిమ్యాచ్‌ ఆడుతున్న బంగ్లా జట్టు శుభారంభం కోసం ప్రయత్నిస్తోంది.