అక్రమ సంబంధం, స్నేహితుడిని రాయితో మోది చంపేసాడు
వారిది వేరే వేరే వృత్తి. ఒకరేమో ఆటో డ్రైవర్. ఇంకొకరేమో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. కానీ కలిసి చిన్నప్పుడు చదువుకున్నారు. ఆ స్నేహం పెళ్ళయిన తరువాత కూడా కొనసాగింది. కానీ భార్య కారణంగా గొడవ జరిగి చివరకు ప్రాణాలే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు.
బెంగుళూరులోని విద్యారణ్యపురంలో నివాసముంటున్న విశ్వ, నందిని. విశ్వ స్నేహితుడు రవికుమార్ దగ్గరలోని నరసింహస్వామి లేఔట్లో నివసిస్తూ ఉండేవాడు. రవి, విశ్వలు మంచి ఫ్రెండ్స్. చిన్ననాటి మిత్రులు.
ఇద్దరికీ వివాహం జరిగింది. నందిని హౌస్ వైఫ్. ఇంటి పట్టునే ఉండేది. రవి భార్య కూడా ఇంటి దగ్గరే ఉండేది. అయితే తరచూ స్నేహితులు కలిసే వారు. విశ్వ ఇంటికి ఎక్కువగా రవి వచ్చేవాడు. కానీ విశ్వ మాత్రం రవి ఇంటికి పెద్దగా వెళ్ళేవాడు కాదు.
ఒకవేళ వెళ్ళినా ఇంటి బయటి నుంచే మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఈ నేపథ్యంలో విశ్వ భార్య నందిని రవికి దగ్గరైంది. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతేకాదు రవి ఏకంగా ఆమెకు తాగుడు కూడా నేర్పించేశాడు.
విశ్వ బయటకు వెళ్ళిపోయినప్పుడు రవి ఇంటికి వెళ్ళడం.. ఆమెతో కలిసి మద్యం సేవించడం. ఆ తరువాత శృంగారం చేయడం చేసేవాడు. ఎక్కువరోజులు ఇది దాగదుదా.. ఇంటికి పక్కన ఉన్నవారు విశ్వకు అసలు విషయం చెప్పేశారు. నీ ప్రాణ స్నేహితుడే నిన్ను మోసం చేస్తున్నాడని.
దీంతో రగిలిపోయిన విశ్వ తన స్నేహితుడిని అంతమొందించాలనుకున్నాడు. విశ్వకు తాగడం అలవాటు లేదు. అయితే పార్టీ చేసుకుందామని రవిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్ళాడు. రవికి మద్యం పోసి ఇచ్చాడు. తాను కూడా తాగడం మొదలెట్టాడు. నీకు అలవాటు లేదు కదా అంటూ రవి మాట్లాడుతూ ఉండగానే దాడికి ప్రయత్నించాడు.
దీంతో తేరుకున్న రవి విషయం తెలిసిపోయినట్లు భావించి విశ్వపై రాయితో దాడి చేశాడు. దీంతో అతని తలకు గాయాలై విశ్వ అక్కడికక్కడే చనిపోయాడు. రవి పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపిన పోలీసులు విచారణ జరుపగా అక్రమ సంబంధమే కారణమని నిర్థారించుకున్నారు.