సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (10:43 IST)

cheating: క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.45 వేలు, లాగేసింది రూ.41 లక్షలు

cyber hackers

వాస్తవానికి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటేనే చాలామంది జడుసుకుంటుంటారు. అలాంటిది ఇద్దరు వ్యక్తులు క్రెడిట్ కార్డులు తీసుకోవడమే కాకుండా రివర్సులో బ్యాంకు సిబ్బందికే చుక్కలు చూపించారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.


 
హైదరాబాదులో ఓ బ్యాంకు నుంచి ఓ వ్యక్తి రూ. 45 వేల రుణ పరిమితితో క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. నెల తిరిగేలోగా ఏకంగా రూ. 41.69 లక్షలు వాడేసాడు. మరోవ్యక్తి రూ. 90 వేల రుణపరిమితితో కార్డు తీసుకుని రూ. 26.85 లక్షల మేరకు వాడేసాడు.


ఇది ఎలా జరిగిందో బ్యాంకు సిబ్బందికే అంతుబట్టలేదు. దాంతో ఈ ఇద్దరికీ ఫోన్లు చేయగా వారి ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. పైగా వారు ఇచ్చిన చిరునామా వద్దకు వెళ్లి చెక్ చేస్తే... అది ఫేక్ అని తేలింది. దీనితో బ్యాంకు మేనేజర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు.