మహిళతో సన్నిహిత సంబంధం, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన సీఐ
పెడదోవ పట్టేవారిని ఆ మార్గంలోకి వెళ్లకుండా మంచిమార్గంలో నడిపించాల్సిన పోలీసు అధికారి ఒకరు తలదించుకునే పనిచేసాడు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి కామాంధుడిగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
తెలంగాణ లోని భీమారం భూపాలపల్లి వీఆర్ సీఐగా 2022లో కాకతీయ యూనివర్శిటీ పోలీసు స్టేషనులో ఎస్సైగా విధులు నిర్వర్తించాడు. అప్పట్లో అతడికి హనుమకొండ కాలనీకి చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత అతడు ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినప్పటికీ ఆ మహిళతో స్నేహాన్ని మాత్రం అలాగే సాగించాడు. ఇటీవలే భూపాలపల్లి వీఆర్ సీఐగా బదిలీపై వచ్చాడు.
ఇక అప్పట్నుంచి తనతో సన్నిహితంగా వుంటున్న మహిళ కుమార్తెపై కన్నేసాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో విషయాన్ని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేసారు. అనంతరం... సీఐపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.