గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 జులై 2022 (12:57 IST)

పట్టుకోండి.. పట్టుకోండి... మాజీ ఎమ్మెల్యే చింతమనేని పారిపోతున్నాడు... ఎక్కడ?

cock fight
చింతమనేని ప్రభాకర్. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఏదో ఓ విషయంలో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్... కోడి పందేలు ఆడుతున్న సమయంలో పోలీసులు దాడి చేయగా, అక్కడి నుంచి పరారయ్యారట.

 
వివరాలు చూస్తే.... పటాన్ చెరు మండలంలోని చినకంజర్ల శివారులో మామిడి తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు డిఎస్పి భీంరెడ్డికి సమాచారం అందింది. దీనితో సిబ్బంది బుధవారం రాత్రి మామిడితోటవైపు వెళ్లారు. అక్కడ సుమారు 70 మంది వున్నట్లు పోలీసులు చెపుతున్నారు. వీరిలో 21 మందిని పోలీసులు పట్టుకోగలిగారు.

 
పోలీసులను చూసి మాజీ ఎమ్మెల్యే చింతమనేనితో సహా 50 మంది దిక్కుతోచినట్లు ఎటుబడితే అటు పరుగలుతీసారు. కాగా ఘటనా స్థలంలో 13 లక్షల నగదు. 27 సెల్ఫోన్లు, 30 కోడికత్తులు, 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.