శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (09:38 IST)

సైనైడ్ తాగి ఆత్మహత్య.. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులే...

family members
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా సైనైడ్ తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల బాధ తాళలేక వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఓ స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం గత కొంతకాలంగా అనకాపల్లిలో ఉంటుంది. గురువారం రాత్రి వీరంతా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన సైనైడ్ సేవించారు. వీరిలో శివరామకృష్ణ (40), మాధవి (38), వైష్ణవి (16), లక్ష్మి (13)లు ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ సైనైడ్ సేవించిన మరో కుమార్తె కుసుమప్రియ (13) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుంది. అప్పుల బాధలు కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
మూవింగ్ కారు పైభాగంలో చిన్నారుల నిద్ర... వీడియో వైరల్... 
 
గోవా రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదకరరీతిలో కారులో ప్రయాణించారు. వేగంగా వెళుతున్న కారు పైభాగంలో వారు నిద్రిస్తున్నారు. ఈ దృశ్యం గోవా రాష్ట్రంలోని మాపుసా పట్ణణ సమీపంలో కనిపించింది. వీరిద్దరూ ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో బుధవారం ఆ వాహనం వెళుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 
 
ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకుని ఉండటంతో వీడియో తీస్తున్న వ్యక్తి కారు డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతను సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి మాపుసా పట్టణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కారు నంబరు ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగివుండటం గమనార్హం. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ... 
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు.