1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 23 మే 2025 (13:38 IST)

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

Actor Madenur Manu held on rape charges
తనను పెళ్లాడుతానని చెప్పి గత 3 ఏళ్లుగా కన్నడ నటుడు మదేనర్ మను తనపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 33 ఏళ్ల సహనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మను నటించిన తాజా చిత్రం కుళదల్లి కీల్యవుడు ఇటీవలే విడుదలైంది. ఈ నేపధ్యంలో అతడిపై సహనటి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసాయి.
 
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నటి ఈ క్రింది విషయాలను పేర్కొన్నది. '' మను నాకు నవంబర్ 2022లో పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే నన్ను లొంగదీసుకున్నాడు. గట్టిగా నిలదీస్తే పెళ్లాడుతానని ప్రామిస్ చేసాడు. ఆ తర్వాత అతడు నాపై గత మూడేళ్లుగా తరచూ అత్యాచారం చేస్తున్నాడు. తనను పెళ్లాడమని అడిగితే భౌతికంగా, మానసికంగా నన్ను వేధిస్తున్నాడు. అంతేకాదు, అతడికి అంతకుమునుపే పెళ్లై ఓ సంతానం కూడా వున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాను.
 
మొదటిసారిగా అతడిని నవంబర్ 29, 2022లో ఓ కామెడీ షోలో కలిసాను. శివమొగ్గలో ఓ హోటల్ గదిలో అతడు నాపై అత్యాచారం చేసాడు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను గట్టిగా నిలదీస్తే నేను వుంటున్న గదికి వచ్చి ఓ మంగళసూత్రాన్ని మెడలో కట్టి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి నేను వుంటున్న ఇంటికి వచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో నేను గర్భవతిని అయ్యాను. అబార్షన్ అయ్యేందుకు మాత్రలు మింగాలంటూ నాపై ఒత్తిడి చేసాడు.
 
అంతేకాదు, ఎవరికైనా నిజం చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా... నాతో అతడు ఏకాంతంగా బెడ్రూంలో గడిపిన దృశ్యాలను వీడియో తీసి వాటిని నెట్లో పెడతానంటూ బెదిరించాడు. నేను గట్టిగా నిలదీస్తే నాపై భౌతిక దాడులు చేసాడు. నాపై అత్యాచారం చేయడమే కాకుండా నన్ను గర్భవతిని చేసిన నటుడు మనుపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ ఆమె పేర్కొంది. నటుడు మనుని పోలీసులు అరెస్ట్ చేసారు.