శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

ప్రేమించిన యువతి దక్కలేదని పెళ్లి మండపంలోనే ఆత్మహత్య

suicide
తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఓ భగ్న ప్రేమికుడు.. ఆ పెళ్లి మండపంలోనే శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ దారుణం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 
 
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్ (19) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అయితే, జూన్ 30వ తేదీ రాత్రి 11 గంటలకు లంగర్ హౌస్ రింగ్ రోడ్ వద్ద ఉన్న మొగల్ ఫంక్షన్ హాల్లో అమ్మాయికి వేరే వారితో పెళ్లి జరుగుతోందన్న విషయం అశ్వక్​కు తెలిసింది. 
 
దీంతో వెంటనే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని ఒంటిపైన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశ్వక్ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.