గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 నవంబరు 2021 (15:22 IST)

షాపింగ్ మాల్: యువతి దుస్తులు మార్చుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసారు

హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో వున్న ఓ షాపింగ్ మాల్‌లోని ట్రయల్ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీసారు. ఈ విషయాన్ని యువతి గమనించి కేకలు వేసింది. దీనితో అక్కడున్నవారిలో ఒకరు 100కి డయల్ చేయడంతో పోలీసులు వచ్చారు.

 
యువకుల నుంచి ఫోనుని తీసుకున్న పోలీసులు ఆ వీడియోను తొలగించారు. ఇంకా వారి ఫోనును నిశితంగా పరిశీలించగా అందులో మరికొన్ని అశ్లీల వీడియోలు వున్నట్లు తేలింది. దానితో వాటిని ఇంకెవరినైనా ఇలాగే తీసారా లేదంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసారా అన్నది పరిశీలిస్తున్నారు.

 
కాగా ఈ పోకిరీలను దుకాణంలోకి అనుమతించి వారికి సహకారమందించిన షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.