గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (14:00 IST)

తలలేని మహిళ మొండెంను ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌ కంటోన్మెంట్ ఏరియాలో కాలువలో తలలేని, బాగా కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ కుళ్లిపోయిన శవాన్ని వీధి కుక్కలు ఈడ్చెకెళుతుండగా, స్థానికులు గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీనిపై మీరట్ అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ మీనా గురువారం ఇలా స్పందిస్తూ, 'ఎవరో ఉద్దేశపూర్వకంగాగానే బాధితురాలిని ఇలా హత్య చేసినట్టుగా తెలుస్తోందన్నారు. హత్యకు గురైన మహిళ వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారని తెలిపారు. 
 
స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాల్ కుర్తి స్పందిస్తూ, 'ఇది ఎటువంటి ఆధారాలు లేని బ్లైండ్ కేసు. శరీరం బాగా కుళ్లిపోయింది మరియు సరైన వయస్సును గుర్తించడం కూడా కష్టం. శవపరీక్ష గురువారం జరుగుతుందని, ఆ తర్వాతే మృతికి గల కారణాలు తెలియవచ్చన్నారు.