Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సోషల్ మీడియాలో #ByeByeYCP #EndOfTDP - నవ్వుకుంటున్న ఏపీ జనం

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:13 IST)
ఏపీ రాజకీయాలు ఎలా వున్నాయని అడిగితే.. ఏరికోరి తలనొప్పి, బీపీ, షుగర్ వ్యాధులు తెచ్చుకోవాలంటే ఆ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాలి అని కొందరు ప్రజలు చెబుతున్నారు. అదేంటి... పుసుక్కున అలా అనేసారు అని అడిగితే వాళ్లు చెబుతున్న రీజన్స్ విని షాక్ అవ్వాల్సిందే. అసలు తాము ఏ పార్టీకి ఓటు వెయ్యాలన్నది ఎప్పుడో డిసైడ్ అయిపోయినట్లు చెబుతున్నారు వారు. ఈమధ్యలో ఎవరికివారు తామే గొప్ప అంటే తామే గొప్ప అని గొప్పలు చెప్పుకుంటూ ఊరూవాడా బ్యానర్లు వేసుకుంటూ హడావుడి చేస్తున్నారు.
 
మీరు సోషల్ మీడియా చూసారా? ఉదయం #ByeByeYCP ట్రెండింగులో వుంటే సాయంత్రానికి #EndOfTDP ట్రెండింగ్ ట్యాగ్ అవుతుంది. అంటే.. ఆ ట్యాగులను చూసి జనం మారిపోతారని అనుకుంటున్నారా? అదేమీ కుదరదండి బాబూ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఆ ప్రకారం ఓటు వేసి షాకిస్తారు. ఏ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసినా అక్కడికి పెద్దమొత్తంలో బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు అందుతున్నాయని మరొకరు అంటున్నారు.
 
కనుక కాస్త బిర్యానీ తినేసి మద్యం కూడా తాగేసి ఏదో కొద్దిసేపు సదరు రాజకీయ నాయకుడు చెప్పింది వినేందుకు చెవులు అప్పజెప్పి అయిపోగానే వచ్చేస్తున్నాము. అంతమాత్రాన వాళ్లకి ఓటు వేస్తామని అనుకుంటే పొరబాటే. మా లెక్క మాకుంది. వచ్చే ఎన్నికల్లో మాకు న్యాయం చేయగల పార్టీ ఏదో ఇప్పటికే డిసైడ్ చేసుకున్నాము. కనుక ఆ పార్టీకి మా ఓట్లు వేస్తామని అంటున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments