శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (11:18 IST)

హనీ రోజ్ ఫిట్ నెస్ అదుర్స్.. జిమ్ ప్రమోషన్ ఫోటోలు వైరల్

Honey Rose
Honey Rose
నందమూరి హీరో బాలకృష్ణతో కలిసి తెలుగులో చివరిగా ‘వీరసింహా రెడ్డి’లో కనిపించిన హనీ రోజ్, తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన లుక్‌లతో సోషల్ మీడియా ద్వారా మంత్రముగ్ధులను చేస్తోంది. 
 
ఇటీవల, ఆమె ఒక జిమ్‌ను ప్రమోట్ చేస్తూ, ఆత్మవిశ్వాసంతో కూడిన స్టైల్‌ లుక్‌లో కనిపించింది. హనీ రోజ్ ఒక చిక్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్‌ని ధరించి, ఆరెంజ్ ప్యాంట్‌, మ్యాచింగ్ సన్ గ్లాసెస్‌తో జత చేసి ఫ్యాషన్ రూపంలో కనిపించింది. 
 
జిమ్ బ్రాండ్ కోసం ప్రమోషనల్ షూట్ సందర్భంగా, డంబెల్స్ పైకి ఎత్తుతూ ఆమె తన ఫిట్‌నెస్‌ లుక్‌తో అదరగొట్టింది. 'తేరీ మేరీ'లో కనిపించిన తర్వాత హనీ రోజ్ తన రాబోయే ప్రాజెక్ట్ 'రేచెల్' కోసం పనిచేస్తోంది.

Honey Rose
Honey Rose